Vijay Sai Reddy: బూట్లతో రామతీర్థంలో అడుగుపెట్టిన చంద్రబాబు తీవ్ర అపచారానికి పాల్పడ్డాడు: విజయసాయి

Vijayasai Reddy alleges Chandrababu came to Ramatheertham shrine with shoe

  • రామతీర్థంపై రాజకీయ రగడ
  • క్షేత్రాన్ని సందర్శించిన చంద్రబాబు
  • బూటు కాళ్లతో ఎవరైనా వస్తారా అంటూ విజయసాయి విసుర్లు
  • చంద్రబాబుకు భక్తి లేదని వ్యాఖ్యలు

విజయనగరం జిల్లా రామతీర్థంలో కొన్నిరోజుల కిందట రాముల వారి విగ్రహం తల నరికిన దుండగులు కోనేరులో పడేయడంతో మొదలైన రగడ ఇవాళ పతాకస్థాయికి చేరుకుంది. నాయకులు ఒకర్నొకరు విమర్శించుకోవడానికి  ఏ చిన్న అవకాశం దొరికినా వదలడంలేదు. ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రామతీర్థంలో పర్యటించి, విగ్రహం శిరస్సును పడవేసిన కోనేరును పరిశీలించారు. అక్కడి అర్చకులతో మాట్లాడారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ చీఫ్ చంద్రబాబుపై ఆరోపణలు చేశారు.

చంద్రబాబు బూటు కాళ్లతో రామతీర్థం పుణ్యక్షేత్రంలో అడుగుపెట్టారని, తద్వారా తీవ్ర అపచారానికి పాల్పడ్డారని వ్యాఖ్యానించారు. బూటు కాళ్లతో ఎవరైనా దైవ సన్నిధిలోకి వెళతారా? అని ప్రశ్నించారు. రాజకీయ లబ్ది కోసం పాకులాడే బాబుకు దేవుడిపై భక్తి, సంప్రదాయాల పట్ల వీసమెత్తు గౌరవం కూడా లేవని విజయసాయి విమర్శించారు. అంతేకాదు, చంద్రబాబు కాళ్లకు బూట్లు ఉన్నాయని చెప్పేందుకు కొన్ని ఫొటోలను కూడా పంచుకున్నారు. .

  • Error fetching data: Network response was not ok

More Telugu News