Akhilesh Yadav: బీజేపీ కరోనా వ్యాక్సిన్ నాకొద్దు: అఖిలేశ్ యాదవ్ స్పష్టీకరణ

Akhilesh Yadav says he does not take corona vaccine
  • త్వరలోనే దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ
  • అది బీజేపీ వ్యాక్సిన్ అంటూ అఖిలేశ్
  • దాన్ని ఎలా నమ్ముతామని వ్యాఖ్యలు
  • అఖిలేశ్ వ్యాఖ్యలను ఖండించిన యూపీ డిప్యూటీ సీఎం
దేశవ్యాప్తంగా మొదటి దశలో 3 కోట్ల మందికి ఉచితంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేస్తామని కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ స్పందించారు. అది బీజేపీ వ్యాక్సిన్ అని, దాన్ని తాము విశ్వసించబోమని అన్నారు. బీజేపీ తీసుకువచ్చే కరోనా వ్యాక్సిన్ ను తాను స్వీకరించబోనని స్పష్టం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్కరికీ కొవిడ్ టీకాను ఉచితంగానే అందజేస్తామని అఖిలేశ్ తెలిపారు.

కాగా అఖిలేశ్ వ్యాఖ్యలను ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య తప్పుబట్టారు. కరోనా వ్యాక్సిన్ ను శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు, పరిశోధకులు ఎంతో శ్రమించి తయారుచేశారని, కానీ అఖిలేశ్ తన వ్యాఖ్యల ద్వారా వారందరినీ కించపరిచారని మౌర్య ఆరోపించారు. అఖిలేశ్ తన వ్యాఖ్యల పట్ల వెంటనే క్షమాపణలు చెప్పాలని అన్నారు.

దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సన్నాహకంగా ఇప్పటికే డ్రై రన్ నిర్వహిస్తున్నారు. త్వరలోనే వ్యాక్సిన్ పంపిణీ అమలు చేయనున్నారు.
Akhilesh Yadav
Corona Vaccine
BJP
Uttar Pradesh

More Telugu News