Nagma: గంగూలీ కోసం మరిన్ని ప్రార్థనలు చేద్దాం: నగ్మా

Nagma wishes speedy recovery of Sourav Ganguly

  • ఛాతీనొప్పితో ఆసుపత్రిలో చేరిన దాదా
  • యాంజియోప్లాస్టీ చేయాలన్న డాక్టర్లు
  • ట్విట్టర్ లో స్పందించిన నగ్మా
  • గంగూలీ... నువ్వు త్వరగా కోలువాలంటూ ఆకాంక్ష

బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఛాతీలో నొప్పితో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆయనకు యాంజియోప్లాస్టీ నిర్వహించాలని వైద్యులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో, మాజీ నటి, కాంగ్రెస్ మహిళా నేత నగ్మా స్పందించారు. గంగూలీ... నువ్వు త్వరగా ఆరోగ్యవంతుడివి కావాలని ఆకాంక్షిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు. గంగూలీ వేగంగా కోలుకోవాలని, ఆయన కోసం మరిన్ని ప్రార్థనలు చేద్దామని తెలిపారు.

గతంలో సౌరవ్ గంగూలీ టీమిండియా కెప్టెన్ గా వ్యవహరించిన సమయంలో నగ్మాతో అనుబంధం ఏర్పడిందంటూ వార్తలొచ్చాయి. 2003 ఆస్ట్రేలియా టూర్ ముగిసిన తర్వాత గంగూలీ, నగ్మా కలసి తిరుపతి నుంచి శ్రీకాళహస్తి వచ్చి సర్పదోష నివారణ పూజలు చేయించుకున్నట్టు జోరుగా ప్రచారం జరిగింది. ఓ దశలో గంగూలీ... నగ్మాను పెళ్లాడతాడని భావించారు. అయితే, తన చిన్ననాటి నేస్తం, శాస్త్రీయ నృత్య కళాకారిణి డోనాను గంగూలీ వివాహం చేసుకోగా, నగ్మా ఇప్పటికీ అవివాహితగానే ఉన్నారు.

Nagma
Sourav Ganguly
Hospital
BCCI
Cricket
  • Loading...

More Telugu News