Chandrababu: రామతీర్థం చేరుకున్న చంద్రబాబు... నినాదాలతో హోరెత్తించిన టీడీపీ శ్రేణులు

TDP Supremo Chandrababu Naidu arrives Ramatheertham

  • రామతీర్థంలో రాముడి విగ్రహం తల నరికివేత
  • మండిపడుతున్న విపక్షాలు
  • చంద్రబాబు రాక నేపథ్యంలో రామతీర్థంలో ఉద్రిక్తత
  • మెట్ల మార్గం ద్వారా కొండపైకి పయనమైన చంద్రబాబు

విజయనగరం జిల్లా రామతీర్థం క్షేత్రం రణరంగాన్ని తలపిస్తోంది. రాజకీయనేతల తాకిడితో ఇక్కడి బోడికొండ పరిసరాలు వేడెక్కిపోయాయి. కొద్దిసేపటి క్రితమే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రామతీర్థం చేరుకున్నారు. మార్గమధ్యంలో కొన్ని అడ్డంకులు ఎదురైనా, ఎట్టకేలకు చంద్రబాబు రామతీర్థం రావడంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం పెల్లుబికింది.  టీడీపీ కార్యకర్తల నినాదాలతో బోడికొండ మార్మోగిపోయింది.

కాగా, రామతీర్థం చేరుకున్న చంద్రబాబు మెట్ల మార్గం మొదట్లో కొబ్బరికాయ కొట్టి కొండపైకి పయనమయ్యారు. ఆయన వెంట ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు, పార్టీ అగ్రనేత కళా వెంకట్రావు తదితరులున్నారు. రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహాన్ని తల నరికిన దుండగులు అక్కడున్న కోనేరులో పడేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై విపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి.

  • Error fetching data: Network response was not ok

More Telugu News