Varla Ramaiah: డీజీపీ గారూ.. మీ అనాలోచిత చర్య మరోసారి న్యాయస్థానాలకు తెలియబోతోంది: వర్ల రామయ్య

Varla Ramaiah serious comments on AP DGP

  • రామతీర్థంకు వెళుతున్న చంద్రబాబు
  • ఇప్పటికే అక్కడకు చేరుకున్న విజయసాయిరెడ్డి
  • రామతీర్థం వద్ద తీవ్ర ఉద్రిక్తత

శ్రీరాముడి విగ్రహం తలను దుండగులు నరికిన రామతీర్థ ఆలయానికి టీడీపీ అధినేత చంద్రబాబు వెళుతున్నారు. విజయవాడ నుంచి విశాఖకు విమానంలో వెళ్లిన ఆయన... విశాఖ నుంచి విజయనగరంకు రోడ్డు మార్గంలో బయలుదేరారు.

మరోవైపు చంద్రబాబు కంటే ముందే వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రామతీర్థం కొండపైకి చేరుకున్నారు. ప్రస్తుతం అక్కడకు పెద్ద సంఖ్యలో వైసీపీ, టీడీపీ శ్రేణులు చేరుకున్నాయి. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో, ఈ అంశంపై వర్ల రామయ్య తీవ్రంగా స్పందించారు. డీజీపీని ఉద్దేశించి ఆయన ట్వీట్ చేశారు.

'డీజీపీ గారూ! గతంలో విశాఖ విమానాశ్రయంలో జరిగిన సంఘటన రిపీట్ అవుతున్నది. మీ అనాలోచిత చర్య మరోసారి రాష్ట్రానికి, న్యాయస్థానాలకు తెలియబోతుంది. మేలుకోండి. వీసా రెడ్డిని నిలువరించండి. మరోసారి కోర్టులో నిలబడతారు. చట్టం అమలుచేయండి. విజయసాయిరెడ్డి డైరెక్షన్లో వెళ్ళకండి' అని వర్ల ట్వీట్ చేశారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News