సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  

02-01-2021 Sat 07:13
  • పది భాషల్లోకి సమంత వెబ్ సీరీస్
  • స్క్రిప్టుకి మార్పులు చేసిన క్రిష్ 
  • వేసవికి వెళ్లిన 'రంగ్ దే' విడుదల       
Samantas family Man 2 web series dubbed into Ten languages

*  కథానాయిక సమంత తొలిసారిగా 'ఫామిలీ మ్యాన్ 2' వెబ్ సీరీస్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సీరీస్ ని మొత్తం 10 భారతీయ భాషల్లోకి అనువదిస్తున్నారు. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్న ఈ సీరీస్ లో ఇంకా ప్రియమణి, మనోజ్ బాజ్ పాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో సమంత టెర్రరిస్టుగా కనిపిస్తుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోస్ దీనిని స్ట్రీమింగ్ చేస్తుంది.
*  పవన్ కల్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపొందే చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పూర్తయింది. కొవిడ్ నేపథ్యంలో ఈ చిత్రం బడ్జెట్టును తగ్గించాలని నిర్ణయించడంతో, అందుకు తగ్గట్టుగా స్క్రిప్టుకి కొన్ని మార్పులు చేర్పులు చేసినట్టు తెలుస్తోంది. 'వకీల్ సాబ్' తర్వాత పవన్ నటించే సినిమా ఇదే అవుతుంది.
*  నితిన్ కథానాయకుడుగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న 'రంగ్ దే' చిత్రం విడుదల అనుకున్నట్టుగానే వాయిదా పడింది. సంక్రాంతికి విడుదల కావలసిన ఈ చిత్రాన్ని మార్చ్ 26కి వాయిదా వేసినట్టు అధికారికంగా ప్రకటించారు. ఇందులో కీర్తి సురేశ్ కథానాయికగా నటించింది.