Corona Virus: దేశంలో క్రమంగా పెరుగుతున్న కరోనా కొత్త స్ట్రెయిన్ కేసులు!

4 New Cases Of Mutant Covid Strain Detected In India

  • ఈరోజు మరో నాలుగు కేసుల నమోదు
  • మొత్తం 29కి పెరిగిన కేసుల సంఖ్య
  • హైదరాబాద్ ల్యాబ్ లో ఒక కేసు గుర్తింపు

భారత్ లో కొత్త కరోనా స్ట్రెయిన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా మరో నాలుగు కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. తాజా కేసులతో కలిపి కొత్త స్ట్రెయిన్ కేసుల సంఖ్య 29కి పెరిగింది. తాజాగా నమోదైన నాలుగు కేసులలో మూడు కేసులను బెంగళూరు ల్యాబ్ లో నిర్ధారించారు. నాలుగో కేసును హైదరాబాదు ల్యాబ్ లో గుర్తించారు.

ఇప్పటి వరకు 10 కేసులు ఢిల్లీలోని ల్యాబుల్లో, 10 కేసులు బెంగళూరు ల్యాబ్ లో, 5 కేసులు పూణెలోని ల్యాబ్ లో, మూడు కేసులు హైదరాబాద్ ల్యాబులో, ఒక కేసు పశ్చిమబెంగాల్ లోని ల్యాబులో గుర్తించారు. కొత్త స్ట్రైయిన్ కు గురైన వారందరినీ తగిన వైద్య సదుపాయాలు ఉన్న ఐసొలేషన్లలో ఉంచారు.

ఈ కొత్త స్ట్రెయిన్ ఇతర కరోనా స్ట్రెయిన్ల కంటే వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటి వరకు ఈ స్ట్రెయిన్ ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, డెన్మార్క్, స్వీడన్, ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్, స్విట్జర్లాండ్, జర్మనీ, కెనడా, జపాన్, లెబనాన్, సింగపూర్, ఇండియా దేశాలకు విస్తరించింది.

  • Loading...

More Telugu News