Somu Veerraju: విగ్రహాల ధ్వంసం జరుగుతుంటే హోంమంత్రి సుచరిత ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు: సోము వీర్రాజు

Somu Veerraju comments on idols vandalizing issue
  • ఏపీలో మరో ఆలయంపై దాడి
  • రాజమండ్రి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం ధ్వంసం
  • దాడులు నిరంతరం జరుగుతున్నాయన్న సోము
  • దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్
గత రాత్రి రాజమండ్రిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేసిన ఘటనపై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు స్పందించారు. రాష్ట్రంలో దేవాలయాలపై నిరంతరం దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వరుసగా ఇలాంటి దాడులు జరుగుతుంటే ఏపీ హోంమంత్రి సుచరిత ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని సోము వీర్రాజు ఆరోపించారు. హోంమంత్రి వైఖరి చూస్తుంటే జగన్ ప్రభుత్వ చిత్తశుద్ధి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అని వ్యాఖ్యానించారు. దేవాలయాలపై దాడుల అంశంపై ప్రజాగ్రహం పెల్లుబుకక ముందే పరిస్థితులను చక్కదిద్దాలని హితవు పలికారు. విగ్రహాల ధ్వంసానికి పాల్పడుతున్న దోషులను కఠినంగా శిక్షించాలని, లేకపోతే బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని సోము హెచ్చరించారు.
Somu Veerraju
Mekathoti Sucharitha
Idols Vandalizing
Jagan
Andhra Pradesh

More Telugu News