దాదా సాహెబ్ ఫాల్కే (సౌత్) అవార్డులు.. ఉత్తమ నటుడిగా నవీన్ పొలిశెట్టి

01-01-2021 Fri 16:27
  • దాదా సాహెబ్ ఫాల్కే దక్షిణాది అవార్డుల ప్రకటన
  • నాగార్జునకు విలక్షణ నటుడుగా అవార్డు
  • ఉత్తమ నటిగా రష్మిక మందన్న
  • ఉత్తమ చిత్రం కేటగిరీలో అవార్డుకు ఎంపికైన జెర్సీ
Naveen Polisetty won the prestigious Dada Saheb Phalke award

యువనటుడు నవీన్ పొలిశెట్టి ప్రతిష్ఠాత్మక అవార్డును కైవసం చేసుకున్నాడు. దక్షిణాది సినీ రంగానికి సంబంధించి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డులను ఇవాళ ప్రకటించారు. ఏజెంట్ శ్రీనివాస ఆత్రేయ చిత్రంలో డిటెక్టివ్ పాత్రలో అద్భుతంగా రాణించిన నవీన్ పొలిశెట్టి దాదా సాహెబ్ ఫాల్కే దక్షిణాది అవార్డుల్లో ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు.

ఇక, సీనియర్ హీరో అక్కినేని నాగార్జునకు అత్యంత విలక్షణ నటుడు కేటగిరీలో అవార్డు లభించింది. ఉత్తమ చిత్రంగా నాని నటించిన జెర్సీ, ఉత్తమ నటిగా డియర్ కామ్రేడ్ చిత్రానికి గాను రష్మిక మందన్న, ఉత్తమ దర్శకుడిగా సుజీత్ (సాహో), బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ అవార్డులకు ఎంపికయ్యారు. ఈ దాదా సాహెబ్ ఫాల్కే దక్షిణాది అవార్డుల కార్యక్రమాన్ని ఫిబ్రవరి 20న ముంబయి తాజ్ లాండ్స్ ఎండ్ హోటల్లో నిర్వహించనున్నారు. గతంలో ఈ అవార్డులను మహేశ్ బాబు, అనుష్క, కీర్తి సురేశ్ అందుకున్నారు.