నేడు 42వ పుట్టినరోజును జరుపుకున్న విద్యాబాలన్

01-01-2021 Fri 15:21
  • 2005లో బాలీవుడ్ కు పరిచయమైన విద్యాబాలన్
  • తొలిచిత్రం 'పరిణీత' ద్వారా మంచి గుర్తింపు
  • అంతకు ముందు హిందీ సీరియల్ లో నటించిన విద్య
Actress Vidya Balan celebrating 42nd birthday

ప్రముఖ సినీ నటి విద్యాబాలన్ పుట్టినరోజు నేడు. ఈరోజు ఆమె 42వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమెకు సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 2005లో 'పరిణీత' సినిమా ద్వారా ఆమె బాలీవుడ్ కు పరిచయమయ్యారు. అంతకు ముందు ఏక్తా కపూర్ నిర్మించిన 'హమ్ పాంచ్' అనే ఓ హిందీ సీరియల్ లో ఆమె నటించారు.

1995 నుంచి 2006 వరకు ఈ సీరియల్ టెలికాస్ట్ అయింది. ఈ సీరియల్ ప్రారంభమైన ఏడాది తర్వాత విద్య అందులో నటించింది. సీరియల్ లో లీడ్ రోల్ అయిన నంగియా పాత్రను తొలుత రాధిక మాథూర్ పోషించింది. ఏడాది తర్వాత ఆ స్థానంలో విద్య నటించింది. ఈ సీరియల్ లో నటిస్తుండగానే విద్య బాలీవుడ్ లో అడుగుపెట్టారు.