Jagan: ప్రధాని మోదీకి ఇళ్ల పట్టాల పంపిణీ గురించి వివరించిన సీఎం జగన్

  • సీఎంలతో ప్రధాని మోదీ వర్చువల్ సమావేశం
  • హాజరైన సీఎం జగన్
  • అర్హులందరికీ ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని వెల్లడి
  • 2022 నాటికి ఇళ్లు పూర్తిచేస్తామని స్పష్టీకరణ
CM Jagan explains housing scheme details to PM Narendra Modi

నూతన సంవత్సరం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించారు. వర్చువల్ విధానంలో జరిగిన ఈ సమావేశంలో ఏపీ సీఎం జగన్ కూడా పాల్గొన్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన సీఎం జగన్ రాష్ట్ర అభివృద్ధిని ప్రధానికి వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులందరికీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నామని, మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ అక్కచెల్లెమ్మల పేరిటే రిజిస్ట్రేషన్ చేయిస్తున్నామని వెల్లడించారు.

30.75 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని, అందుకోసం 68,677 ఎకరాల భూమి సేకరించామని, దీంట్లో 25,433 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని తెలిపారు. 2022లోపే ఈ ఇళ్లు పూర్తి చేయాలని తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని స్పష్టం చేశారు. 16,098 ఈడబ్ల్యూఎస్ కాలనీలు అభివృద్ధి చేస్తున్నామని, ఈ కాలనీల్లో మంచినీరు, విద్యుత్ సహా అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నామని సీఎం జగన్ చెప్పారు.

More Telugu News