బ్ర‌హ్మానందంగారి నుంచి విలువైన గిప్టు అందింది: అల్లు అర్జున్

01-01-2021 Fri 13:37
  • స్వ‌యంగా వెంక‌టేశ్వ‌ర స్వామి బొమ్మ‌ను గీసిన బ్ర‌హ్మానందం
  • క్యాలెండ‌ర్ నూ ముద్రించి బ‌న్నీకి గిఫ్ట్
  • కృత‌జ్ఞ‌త‌లు అంటూ అల్లు అర్జున్ ట్వీట్
Allu Arjun THE MOST PRICELESS GIFT I RECEIVED FROM BRAHMANANDAM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి హాస్య‌న‌టుడు బ్ర‌హ్మానందం ఓ గిఫ్ట్ అందించారు. ఈ విష‌యాన్ని తెలుపుతూ బ‌న్నీ ట్వీట్ చేశాడు. ఈ గిప్టుకు సంబంధించిన ఫొటోల‌ను అల్లు అర్జున్ పోస్ట్ చేశాడు. 'మ‌న బ్ర‌హ్మానందంగారి నుంచి చాలా విలువైన గిఫ్టును అందుకున్నాను. ఇందుకోసం 15 రోజులు ప‌ని చేశారు. పెన్సిల్ తో ఈ చిత్రాన్ని వేశారు. కృత‌జ్ఞ‌త‌లు' అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.

క్వారంటైన్ స‌మ‌యంలో బ్ర‌హ్మానందం త‌న‌లోని క‌ళ‌ను వెలికితీస్తూ బొమ్మ‌లు వేసిన విష‌యం తెలిసిందే. పెన్సిల్ తో వెంక‌టేశ్వ‌ర స్వామి బొమ్మ‌ను బ్ర‌హ్మానందం వేశారు. ఈ బొమ్మ‌ల‌తో క్యాలెండ‌ర్ ను ముద్ర వేయించారు.