పవన్ 'వకీల్ సాబ్' పోస్టర్ విడుదల

01-01-2021 Fri 12:53
  • న్యూ ఇయర్ సందర్భంగా పవన్ ఫ్యాన్స్ కు ట్రీట్
  • పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో 'వకీల్ సాబ్'
  • సంక్రాంతికి విడుదల కానున్న టీజర్
Pawan Kalyans Vakeel Saab poster released

కొత్త సంవత్సరం సందర్భంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు ట్రీట్ వచ్చింది. పవన్ తాజా చిత్రం 'వకీల్ సాబ్'కు చెందిన లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. పవన్, శ్రుతిహాసన్ ఇద్దరూ బైక్ మీద వెళ్తున్న సన్నివేశం పోస్టర్ లో ఉంది. ఈ ఫొటోలో పవన్, శ్రుతి ఇద్దరూ చాలా గ్లామరస్ గా కనిపిస్తున్నారు.

బాలీవుడ్ లో వచ్చిన 'పింక్' సినిమాను తెలుగులో 'వకీల్ సాబ్'గా రీమేక్ చేస్తున్నారు. హిందీలో అమితాబ్ పోషించిన పాత్రను పవన్ పోషిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. మరోవైపు ఈ సినిమా టీజర్ ను సంక్రాంతి రోజున విడుదల చేయనున్నారు. ఏప్రిల్ 9న సినిమా విడుదల కానుంది.