insurance: ఏపీలో న్యాయవాదులకు బీమా పథకం.. మొదటి పాలసీ అందుకున్న అడ్వకేట్ జనరల్

insurance scheme for advocates

  • యునైటెడ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీతో రాష్ట్ర బార్‌ కౌన్సిల్ ఒప్పందం
  • రాష్ట్ర ప్రభుత్వ సాయంతో బీమా
  • న్యాయవాదులతో పాటు వారి కుటుంబ సభ్యులకు లబ్ధి

ఏపీలోని న్యాయవాదులకు బీమా కోసం యునైటెడ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీతో రాష్ట్ర బార్‌ కౌన్సిల్ ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సాయంతో ఒప్పందం కుదుర్చుకుంది. లాయర్ల బీమా పథకం అమలుకు కావాల్సిన డబ్బును ఆ ఇన్సూరెన్స్‌ కంపెనీకి బార్ కౌన్సిల్  చెల్లించింది. ఈ పథకంలో భాగంగా మొదటి పాలసీని అడ్వకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌కు బీమా సంస్థ ప్రతినిధులు అందచేశారు.

ఈ పథకం ప్రకారం..  న్యాయవాదులతో పాటు వారి కుటుంబ సభ్యులకు రూ.2 లక్షల వరకు నగదు రహిత వైద్యసాయం అందడమే కాకుండా రూ.10 లక్షల వరకు ప్రమాద బీమా కల్పించాలని అడ్వకేట్‌ జనరల్‌ నేతృత్వంలోని కమిటీ నిర్ణయం తీసుకుంది.

ఈ బీమా కోసం 15,552 మంది న్యాయవాదులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందు కోసం ఒక్కో న్యాయవాదికి రూ.5,348 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో న్యాయవాదులు రూ.1000 చొప్పున, మిగిలిన 4,348 రూపాయలు ఆంధ్రపదేశ్‌ ప్రభుత్వం ఇస్తుంది. సంక్షేమ నిధికి సర్కారు ఇచ్చిన నిధుల నుంచి ఈ ప్రీమియాన్ని చెల్లిస్తారు. ఈ బీమా పాలసీ గత ఏడాది డిసెంబర్‌ 30 నుంచి ఈ ఏడాది డిసెంబర్‌ 29 వరకు అమల్లో ఉంటుంది.

  • Loading...

More Telugu News