FasTag: ఫాస్టాగ్ గడువును వచ్చే నెల 15 వరకు పొడిగించిన కేంద్రం

Fastag deadline extended

  • గడువును మరో నెలన్నర రోజులు పెంచిన ప్రభుత్వం
  • ఆ తర్వాతి నుంచి రెట్టింపు ఫీజు వసూలు
  • ప్రస్తుతం 80 శాతం ఫాస్టాగ్ చెల్లింపులు

ఫాస్టాగ్ గడువును మరో నెలన్నర రోజులు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. నిజానికి ఈ గడువు నేటితో ముగియనుండగా దానిని ఫిబ్రవరి 15 వరకు పొడిగిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి వరకు టోల్‌ప్లాజాల వద్ద హైబ్రిడ్ లేన్లలో ఫాస్టాగ్‌తోపాటు నగదు కూడా చెల్లించవచ్చని తెలిపింది.

టోల్‌ప్లాజాల వద్ద  ప్రస్తుతం ఫాస్టాగ్‌ను ఉపయోగించి  75-80 శాతం చెల్లింపులు జరుగుతున్నాయి. కాగా, వచ్చే నెల 15 తర్వాత టోల్‌ప్లాజాల వద్ద ఒక్క లైన్ మినహా మిగతా అన్నీ ఫాస్టాగ్‌లుగా మారనున్నాయి. గడువు తర్వాత కూడా ఫాస్టాగ్‌గా మారని వారి నుంచి రెట్టింపు ఫీజు వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

FasTag
Toll plaza
union ministry
  • Loading...

More Telugu News