KCR: అందరూ సుఖసంతోషాలతో ఉండాలి: కేసీఆర్

KCR greets TS people on the occasion of New Year
  • రాష్ట్ర ప్రజలకు న్యూ ఇయర్ గ్రీటింగ్స్ తెలిపిన కేసీఆర్
  • అందరూ సంతోషంగా ఉండాలని ప్రార్థించానని వ్యాఖ్య
  • పలు దేశాల్లో అప్పుడే ప్రారంభమైన న్యూ ఇయర్
తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త సంవత్సర శుభాకాంక్షలను తెలియజేశారు. కొత్త ఆకాంక్షలు, కొత్త ఆశలతో ప్రజలంతా నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్నారని... అందరూ సుఖసంతోషాలతో ఉండాలని దేవుడిని ప్రార్థించానని చెప్పారు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్న ప్రయత్నాలు ఫలించాలని కోరుకున్నానని తెలిపారు.

మరోవైపు అప్పుడే కొత్త సంవత్సర సందడి మొదలైంది. పలు దేశాల్లో కొత్త సంవత్సరం ప్రారంభమైంది. కరోనా వల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న ప్రజలు.. కొత్త సంవత్సరం బాగుండాలనే ఆకాంక్షలతో నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు.
KCR
TRS
New Year Greetings

More Telugu News