New Zealand: కొత్త సంవత్సరంలో అడుగుపెట్టిన న్యూజిలాండ్... ఆక్లాండ్ లో వేడుకలు ప్రారంభం

New Zealand welcomes new year

  • 2021కి స్వాగతం పలికిన పసిఫిక్ దేశాలు
  • కొద్దిసేపటి కిందట న్యూజిలాండ్ లో కొత్త సంవత్సరం ఆరంభం
  • మొట్టమొదటగా 2021లో ప్రవేశించిన సమోవా, కిరిబాటి
  • ఆఖరుగా బేకర్ ఐలాండ్స్ లో నూతన సంవత్సర ఘడియలు

నూతన సంవత్సరాదికి ప్రపంచం స్వాగతం పలుకుతోంది. పసిఫిక్ మహాసముద్రంలోని న్యూజిలాండ్ దీవులు 2021లోకి ప్రవేశించాయి. న్యూజిలాండ్ కాలమానం ప్రకారం అర్ధరాత్రి 12 గంటలు కాగానే బాణసంచా వెలుగుజిలుగులతో ఆకాశం మిరుమిట్లు గొలిపింది. ఆక్లాండ్ సహా న్యూజిలాండ్ ప్రధాన నగరాల్లో ప్రజలు సంబరాలు షురూ చేశారు. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో పరిమిత స్థాయిలోనే వేడుకలకు అవకాశం ఇచ్చారు.

కాగా, ప్రపంచంలో అన్ని దేశాల కంటే ముందుగా సమోవా, కిరిబాటి దీవులు కొత్త సంవత్సరంలోకి అడుగుపెడతాయి. అటు, మానవ ఆవాసయోగ్యం కాని హోలాండ్, బేకర్ దీవులకు చిట్టచివరిగా కొత్త సంవత్సరం వస్తుంది. సమోవా దీవుల్లో నూతన సంవత్సర వేడుకలు ప్రారంభమైన 26 గంటల తర్వాత ఈ రెండు దీవులు కొత్త సంవత్సరంలోకి ప్రవేశిస్తాయి. అటు, ఆస్ట్రేలియా కూడా 2021 సంవత్సరాదికి ఘనస్వాగతం పలికింది.

New Zealand
New Year
2021
Pacific Islands
Samoa
Kiribati
  • Error fetching data: Network response was not ok

More Telugu News