Yediyurappa: సీఎం పదవి నుంచి తనను తొలగిస్తున్నారనే వార్తలపై యడియూరప్ప స్పందన

I will remain as CM for full tenure says Yediyurappa
  • పూర్తి కాలం పదవిలో కొనసాగుతానన్న యడియూరప్ప
  • తన పట్ల హైకమాండ్ సంతృప్తిగా ఉందని వ్యాఖ్య
  • జనవరి 15న కర్ణాటకకు వస్తున్న అమిత్ షా
కర్ణాటక ముఖ్యమంత్రి పదవి నుంచి యడియూరప్పను తొలగించబోతున్నారనే వార్తలు కర్ణాటకలో పెద్ద ఎత్తున ప్రచారమవుతున్నాయి. ఆయన స్థానంలో సీఎంగా మరొకరికి హైకమాండ్ బాధ్యతలను అప్పగించబోతోందనే చర్చ జరుగుతోంది. ఈ వార్తలపై యడియూరప్ప స్పందించారు. ఈ వార్తల్లో నిజం లేదని... పూర్తి కాలం తాను పదవిలో కొనసాగుతానని చెప్పారు. తన నాయకత్వం పట్ల పార్టీ హైకమాండ్ సంతృప్తిగా ఉందని అన్నారు.

ఇదిలావుంచితే, మరోపక్క, జనవరి మొదటి వారంలో బీజేపీ శాసనసభ్యులు సమావేశం కానున్నారు. 4వ తేది నుంచి రెండు రోజుల పాటు ఈ భేటీ జరగనుంది. ఈ భేటీకి సంబంధించిన అజెండా ఏమిటనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. జనవరి 15 నుంచి రెండు రోజుల పర్యటనకు గాను కేంద్ర హోంమంత్రి అమిత్ షా కర్ణాటకకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేల సమావేశం చర్చనీయాంశంగా మారింది.
Yediyurappa
Karnataka
BJP
Amit Shah

More Telugu News