Jagan: అత్యవసర సేవలు, విపత్తు నిర్వహణ వాహనాలను ప్రారంభించిన సీఎం జగన్

CM Jagan inaugurates emergency vehicles
  • క్యాంపు కార్యాలయంలో వర్చువల్ ప్రారంభోత్సవం
  • పచ్చజెండా ఊపిన సీఎం జగన్
  • 14 అత్యవసర వాహనాలు, 36 పోలీసు వాహనాలు ప్రారంభం
  • కార్యక్రమంలో పాల్గొన్న డీజీపీ తదితరులు
రాష్ట్రంలో విపత్తుల నిర్వహణ, అత్యవసర సేవల కోసం ఏపీ సీఎం జగన్ ప్రత్యేక వాహనాలను ప్రారంభించారు. 14 ప్రత్యేక వాహనాలతో పాటు, అత్యవసర పోలీస్ సేవల కోసం మరో 36 వాహనాలకు సీఎం పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ మేరకు తన క్యాంపు కార్యాలయంలో జరిగిన ఓ వర్చువల్ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డీజీపీ గౌతమ్ సవాంగ్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.

కాగా, ఇవాళ అధికారులతో నిర్వహించిన సమీక్షలో సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. పెన్షన్లు, ఇళ్ల పట్టాలు, బియ్యం కార్డులకు సంబంధించి సచివాలయాల్లో పెండింగులు లేకుండా చూడాలని చెప్పారు. నిర్దిష్ట గడువులోపల ఆయా పథకాలు లబ్దిదారులకు అందిస్తామని హామీ ఇచ్చిన మేరకు కష్టపడి పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఇక, అమ్మఒడి పథకానికి అధికారులు అన్ని విధాలుగా సంసిద్ధులై ఉండాలని సీఎం జగన్ స్పష్టం చేశారు.
Jagan
Emergency Vehicles
YSRCP
Andhra Pradesh

More Telugu News