Balakrishna: బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో ల్యుకేమియా బాధితులకు ప్రత్యేక వార్డు ప్రారంభించిన బాలకృష్ణ

  • బసవతారకం ఆసుపత్రిలో క్యాన్సర్ రోగులకు విశిష్ట సేవలు
  • న్యూట్రోపెనిక్ వార్డుకు ఇవాళ ప్రారంభోత్సవం
  • రిబ్బన్ కట్ చేసిన బాలకృష్ణ
  • ఈ వార్డులో అన్ని సౌకర్యాలుంటాయని వెల్లడి
Nandamuri Balakrishna inaugurates Neutropenic ward in Basavatarakam cancer hospital

హైదరాబాదులోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా వేలమంది క్యాన్సర్ రోగులకు సేవలు అందుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ ఆసుపత్రిలో న్యూట్రోపెనిక్ వార్డును ప్రారంభించారు. ఇవాళ జరిగిన ఓ కార్యక్రమంలో బసవతారకం ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ లాంఛనంగా రిబ్బన్ కట్ చేశారు. ఈ విషయాన్ని బాలకృష్ణ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

 ఈ వార్డును ప్రత్యేకించి ల్యుకేమియా (బ్లడ్ క్యాన్సర్) బాధితుల కోసం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ల్యుకేమియా రోగులు ఈ వార్డు ద్వారా ఎంతో భద్రత పొందుతారని బాలయ్య పేర్కొన్నారు. ఈ న్యూట్రోపెనిక్ వార్డు అన్ని వర్గాల ప్రజలకు అత్యంత సముచిత వ్యయంతో అందుబాటులో ఉంటుందని వివరించారు. ల్యుకేమియా బాధితుల కోసం ఈ వార్డును అందుబాటులోకి తీసుకురావడాన్ని గర్వంగా భావిస్తున్నామని తెలిపారు.

More Telugu News