Joe Biden: వైవిధ్యం బైడెన్​ గణం.. 61 శాతం మంది మహిళలే!

In Biden Team For White House 61 percent Are Women 54 percent Are People Of Colour

  • 54 శాతం మంది నల్లజాతీయులు
  • 11% మంది ఎల్జీబీటీలకూ చోటు
  • దేశాన్ని సరికొత్తగా నిర్మిస్తామన్న బైడెన్
  • మొదటి రోజు నుంచే రంగంలోకి దిగుతారన్న కమల

అమెరికాకు కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ శ్వేత సౌధ గణంలో సగానికిపైగా మహిళలు, నల్లజాతీయులే ఉన్నారు. బుధవారం నాటికి వంద మందికిపైగా సభ్యులతో బైడెన్, కమలా హ్యారిస్ లు తమ బృందాన్ని ప్రకటించారు.

అందులో 61 శాతం మంది మహిళలు, 54 శాతం మంది నల్లజాతీయులు ఉన్నారని బైడెన్ అధికార మార్పిడి బృందం ప్రకటించింది.  మరో 11 శాతం మంది ఎల్జీబీటీలు ఉన్నారని తెలిపింది. మొత్తం బృందంలో 20 శాతం మంది మొదటి తరం వారు కాగా.. 40 శాతం మంది స్కూలుకెళ్లని పిల్లలున్న ఉన్నతాధికారులు (నేటి తరం) ఉన్నారు.

వైవిధ్య సిద్ధాంతాలు, కుటుంబ పరిస్థితులు, నైపుణ్యాలను పరిగణనలోకి తీసుకుని బైడెన్ తన బృందాన్ని నియమించుకున్నారని తెలిపింది. ప్రస్తుతం తీసుకున్నది అతి కొద్ది మందిని మాత్రమేనని, మున్ముందు బైడెన్ టీంలో మరింత మంది చేరుతారని అధికార మార్పిడి బృందం చెప్పింది.

కాగా, మొదట్నుంచి తాను, కమల హారిస్ అమెరికాను తలపించే పాలనను అందించాలని కలలుగన్నామన్నారు బైడెన్. వైవిధ్యమైన బృందాన్ని నియమించుకోవడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. దేశాన్ని సరికొత్తగా నిర్మించుకునేందుకు ఇప్పుడు నియమించిన అధికారుల పని, జీవితానుభవాలు ఎంతగానో పనికొస్తాయని అన్నారు.

దేశం బాగును ప్రతిబింబించేలా, ప్రజలు  ఎదుర్కొంటున్న సమస్యలను తీర్చేందుకు ప్రస్తుత బృందం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కమల హారిస్ అన్నారు. మొదటి రోజు నుంచే క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారన్నారు. వారితో కలిసి పనిచేసేందుకు తానూ ఎదురు చూస్తున్నానని చెప్పారు. కరోనాను కట్టడి చేసి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు తమ వంతు కృషి చేస్తామని, దేశాన్ని మళ్లీ మునుపటిలా మారుస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News