New Year 2020: డేవిడ్ వార్నర్ నుంచి మరో వీడియో.. మ‌హేశ్ బాబు సినిమా సీన్లతో ముగింపు!

warner says good bye to 2020

  • ‘బుట్టబొమ్మ’ పాటకు స్టెప్పులతో టాలీవుడ్‌ ప్రేక్షకులను పలకరించిన వార్నర్
  • ఆ తర్వాత వరుసగా పాటలు, సీన్లతో వీడియోలు
  • మహేశ్ బాబు మహర్షి సినిమా వీడియోతో 2020కి టాటా

టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురములో’ సినిమాలో ‘బుట్టబొమ్మ’ పాటకు స్టెప్పులు వేసి అదరగొట్టేసిన ఆస్ట్రేలియా క్రికెటర్, ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ అప్పటి నుంచి టాలీవుడ్ హీరోల డైలాగులు, పాటలతో వీడియోలు చేస్తున్నాడు.

ఈ ఏడాది అల్లు అర్జున్ వీడియోతో తన వీడియోల పరంపరను మొదలు పెట్టిన వార్నర్.. మహేశ్ బాబు వీడియోతో 2020కి బై చెప్పాడు. మహేశ్ బాబు సినిమా ‘మహర్షి’ సినిమాలోని సీన్లకు రీఫేస్ యాప్ తో తన ఫొటో పెట్టి మహేశ్ లా కనపడుతూ అభిమానులను అలరిస్తున్నాడు.

ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో యాప్ సాయంతో మహేశ్ బాబులా కనపడ్డాడు. స్కూటర్ పై వెళ్తుండడం, ‘ఓడిపోవడం అంటే నాకు భయం’ అని డైలాగులు చెబుతుండడం ఈ వీడియోలో చూడొచ్చు. ప్రపంచం మొత్తం నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ 2020కి టాటా చెబుతున్న నేపథ్యంలో వార్నర్ ఈ వీడియో తీసుకున్నాడు.

New Year 2020
David Warner
Cricket
Tollywood
Mahesh Babu
  • Loading...

More Telugu News