IYR Krishna Rao: ఇంతకన్నా దారుణమైన విషయం ఇంకొకటి ఉండదు: ఐవైఆర్

iyr slams ap govt

  • రామతీర్థంలో ధ్వంసమైన కోదండరాముడి విగ్రహం
  • శిరస్సు భాగం కొండపై ఉన్న రామకొలనులో లభ్యం
  • రాష్ట్ర మంతటా వివిధ ప్రాంతాలలో విగ్రహాల ధ్వంసం అంటూ ఐవైఆర్ విమర్శ
  • ఈ విధ్వంస కాండ వెనుక ఎటువంటి కుట్ర ఉందని నిలదీత

విజయ నగరం జిల్లా నెల్లిమర్లలోని రామతీర్థంలో ధ్వంసమైన కోదండరాముడి విగ్రహ శిరస్సు భాగం కొండపై ఉన్న రామకొలనులో నిన్న లభ్యమైందంటూ ఈనాడులో వచ్చిన వార్తను పోస్ట్ చేస్తూ దీనిపై ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు స్పందించారు.

‘ఇంతకన్నా దారుణమైన విషయం ఇంకొకటి ఉండదు. ఇది కేవలం ఏ ఒక్క పార్టీకో కొందరికో సంబంధించిన అంశం కాదు. రాష్ట్ర మంతటా వివిధ ప్రాంతాలలో నిరాటంకంగా జరుగుతున్న ఈ విధ్వంస కాండకు వెనుక ఎటువంటి కుట్ర ఉన్నదో నిష్పాక్షికంగా దర్యాప్తు చేసి బయట పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది’ అని ఐవైఆర్ కృష్ణారావు చెప్పారు.

కాగా, విగ్రహం ధ్వంసంపై విచారణ చేపట్టిన పోలీసులు రెండు రోజులుగా గాలించారు. డాగ్‌ స్క్వాడ్‌ కొలను చుట్టూ తిరగడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టగా విగ్రహ శిరస్సు భాగం దొరికిందని అధికారులు తెలిపారు.

IYR Krishna Rao
Andhra Pradesh
temple
  • Error fetching data: Network response was not ok

More Telugu News