Hyderabad: మద్యం ప్రియులకు గుడ్ న్యూస్.. నేటి అర్ధరాత్రి వరకు తెలంగాణ మద్యం షాపులు ఓపెన్!

Telangana excise department gave permission for liquor shops to open till midnight

  • న్యూ ఇయర్ వేడుకలపై నిఘా పెట్టాలన్న కేంద్రం
  • అందుకు భిన్నంగా ఆబ్కారీ శాఖ ఉత్తర్వులు
  • అడుగడుగునా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు ఉంటాయన్న పోలీసులు

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కు తెలంగాణ ఆబ్కారీ శాఖ దారులు తెరిచింది. నేటి అర్ధ రాత్రి 12 గంటల వరకు మద్యం షాపులు తెరిచి పెట్టుకునేందుకు, ఒంటి గంట వరకు బార్లలో మద్యాన్ని సరఫరా చేసేందుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నూతన సంవత్సర వేడుకల ద్వారా కరోనా వైరస్ మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉందని, కాబట్టి వేడుకలపై నిఘా పెట్టాలంటూ కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసిన వేళ తెలంగాణ ఆబ్కారీ శాఖ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది.

మరోవైపు, రాష్ట్రంలో న్యూ ఇయర్ వేడుకలకు అనుమతులు లేవని డీజీపీ మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. నేడు మూడు కమిషనరేట్ల పరిధిలో అడుగడుగునా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. సీపీ సజ్జనార్ కూడా ఇలాంటి హెచ్చరికలే చేశారు. అయితే, ఆబ్కారీ శాఖ మాత్రం ఇందుకు భిన్నంగా అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం దుకాణాలు తెరుచుకోవచ్చని ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. అలాగే, బార్లు, క్లబ్బులు, టూరిజం హోటళ్లలో రాత్రి ఒంటి గంట వరకు మద్యాన్ని అందించవచ్చని ఎక్సైజ్‌ శాఖ డైరెక్టర్‌ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News