KCR: ‘ఆయుష్మాన్ భారత్‌’కు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్!

  • ఇంతకాలం పథకం అమలును వ్యతిరేకించిన కేసీఆర్
  • ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అమలుకు అంగీకారం
  • ప్రధానమంత్రికి తెలియజేసిన సీఎస్ సోమేశ్ కుమార్
Telangana govt ready to Execution Ayushman Bharat

కేంద్ర ప్రభుత్వ పథకమైన ‘ఆయుష్మాన్ భారత్’ను తెలంగాణలోనూ అమలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ అమల్లో ఉండడంతో ‘ఆయుష్మాన్ భారత్’ పథకం అవసరం లేదన్న ఉద్దేశంతో కేసీఆర్ ఇంతవరకు ఈ పథకం అమలును వ్యతిరేకించారు. తాజాగా, మనసు మార్చుకున్న కేసీఆర్ ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తెలంగాణలోనూ ఆ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించుకున్నారు.

ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తెలంగాణలోనూ అమలు చేయబోతున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ప్రధాని నరేంద్రమోదీకి తెలియజేశారు. రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో ప్రధాని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సోమేశ్ కుమార్ ఈ విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.

More Telugu News