USA: వ్యాక్సిన్ తీసుకున్న అమెరికా నర్సుకు కరోనా పాజిటివ్

Nurse who is vaccinated tests positive with Corona

  • వ్యాక్సిన్ తీసుకున్న ఆరు రోజుల తర్వాత చలి, కండరాల నొప్పులు 
  • పది, పద్నాలుగు రోజుల తర్వాత యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయన్న ఫైజర్
  • ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వివరణ

కరోనా వైరస్ దెబ్బకు అగ్రదేశం అమెరికా అల్లాడి పోయింది. అంచనాలకు మించి అమెరికన్లు కరోనా బారిన పడ్డారు. పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం సంభవించింది. ఈ నేపథ్యంలో ఇటీవలే అమెరికా వ్యాక్సిన్ పంపిణీని ప్రారంభించింది. ఇప్పటి వరకు దాదాపు 21 లక్షల మందికి పైగా వ్యాక్సిన్ తీసుకున్నారు.

కాలిఫోర్నియాకు చెందిన మాథ్యూ అనే మేల్ నర్స్ కూడా ఇటీవల ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఒక రోజల్లా చేయి నొప్పిగా వుంది తప్పితే, మరే ఇతర దుష్ప్రభావాలు కనపడలేదు. ఆరు రోజుల తర్వాత చలి, కండరాల నొప్పులు, అలసట వచ్చాయి. దీంతో టెస్టులు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తేలింది.

 ఈ ఘటనపై ఫైజర్ స్పందించింది. పాజిటివ్ వచ్చినంత మాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. పది, పద్నాలుగు రోజుల తర్వాత యాంటీ బాడీలు ఉత్పత్తి అవుతాయని తెలిపింది. దీనిపై అమెరికాలోని అంటువ్యాధుల చికిత్సా నిపుణుడు క్రిస్టియన్ రేమర్స్ చెబుతూ, మాథ్యూ వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందే అతనికి కరోనా సోకివుండచ్చని అన్నారు.

ఇదిలావుంచితే, మన దేశంలో కూడా జనవరిలో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం చెపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించి కార్యారణ, మార్గదర్శకాలను రూపొందించింది.

  • Loading...

More Telugu News