Bears: పోలీసు స్టేషన్ లో ఎలుగుబంట్ల సందడి... వైరల్ అవుతున్న వీడియో!

Bears in Police Station video Goes Viral

  • చత్తీస్ గఢ్ లో జరిగిన ఘటన
  • వీడియో పోస్ట్ చేసిన దీపాన్షు కబ్రా
  • అందమైన వీడియో అని కామెంట్లు

మూడు ఎలుగుబంట్లు అడవిలో నుంచి బయటకు వచ్చి, చత్తీస్ గఢ్ లోని కాంకర్ సమీపంలోని ఓ పోలీసు స్టేషన్ లో దర్జాగా తిరిగి వెళ్లిన దృశ్యాలు అక్కడి సీసీకెమెరాలో నిక్షిప్తం కాగా, "పోలీసు స్టేషన్ లో అర్ధరాత్రి ఎలుగుబంట్ల ఆకస్మిక తనిఖీ" అని కామెంట్ చేస్తూ పెట్టిన పోస్ట్ ఒకటి తెగ వైరల్ అవుతోంది. స్థానిక ఐపీఎస్ అధికారి దీపాన్షు కబ్రా, తన సామాజిక మాధ్యమ ఖాతాల్లో ఈ వీడియోను పోస్ట్ చేశారు.

ఇక ఈ వీడియోకు క్షణాల్లో వేల వ్యూస్ వచ్చాయి. ఇదెంతో అందమైన వీడియో అని, దీన్ని తమకు చూపిన దీపాన్షుకు ధన్యవాదాలని నెటిజన్లు కామెంట్లు పెట్టారు. కాగా, ఇటీవలి కాలంలో చత్తీస్ గఢ్ లో ఎలుగుబంట్ల సంఖ్య పెరిగింది. ఆమధ్య ఓఆలయం సమీపంలో ఎలుగులు తిరుగాడగా ఆ వీడియోకూ లక్షల వ్యూస్ వచ్చాయి. తాజాగా పోలీసు స్టేషన్ లో ఇవి తిరుగుతున్న వీడియోను మీరూ చూడవచ్చు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News