Ambati Rambabu: అరే సాంబా రాస్కో... ఓడినోళ్లే బోడిలింగాలు: 'వకీల్ సాబ్' పై అంబటి వ్యాఖ్యలు 

Ambati Rambabu replies to Pawan Kalyan comments

  • కృష్ణా జిల్లా పర్యటనలో పవన్ తీవ్ర వ్యాఖ్యలు
  • ఇప్పటికే కౌంటర్ ఇచ్చిన కొడాలి నాని
  • తాజాగా అంబటి ట్వీట్లు
  • అరే సాంబా రాస్కో అంటూ వ్యంగ్యం
  • వకీల్ సాబ్ కాదు నకిలీ సాబ్ అని ఎద్దేవా 

జనసేనాని పవన్ కల్యాణ్ నిన్న కృష్ణా జిల్లా పర్యటనలో చేసిన తీవ్ర వ్యాఖ్యలు వైసీపీ నేతలను తీవ్ర ఆగ్రహానికి గురిచేశాయి. మీ సీఎం సాబ్ కు ఈ వకీల్ సాబ్ హెచ్చరికగా చెప్పండి అంటూ పవన్ నిప్పులు చెరిగారు. దీనిపై మంత్రి కొడాలి నాని ఇప్పటికే కౌంటర్ ఇచ్చారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు కూడా స్పందించారు. పవన్ నటించిన గబ్బర్ సింగ్ చిత్రంలోని పాప్యులర్ డైలాగ్ ను ఉపయోగిస్తూ వ్యాఖ్యలు చేశారు.

"అరే సాంబా రాస్కో.... గెలిచినోళ్లు కాదు... ఓడినోళ్లే బోడిలింగాలు!" అంటూ పవన్ కు బదులిచ్చారు. రైతులకు పరిహారం ఇవ్వకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని పవన్ చేసిన హెచ్చరికలపైనా అంబటి స్పందించారు. అసెంబ్లీ ముట్టడికి ఇదేమైనా సినిమా షూటింగా? అని వ్యాఖ్యానించారు. వకీల్ సాబ్ కాదు నకిలీ సాబ్ అని విమర్శించారు. ఈ మేరకు ట్వీట్లు చేశారు.

Ambati Rambabu
Pawan Kalyan
Vakeel Saab
Kodali Nani
Krishna District
  • Loading...

More Telugu News