Bandi David Prabhakar: గిటార్ బోధనలో గిన్నిస్ రికార్డు సాధించిన హైదరాబాద్ వాసి
- 1996 నుంచి సంగీత బోధన
- సంగీతంతో క్రమశిక్షణ వస్తుందని నమ్మిక
- ఏకంగా 28 గంటల పాటు గిటార్ బోధన
- రికార్డును గుర్తించిన గిన్నిస్ బుక్
హైదరాబాద్ నగరానికి చెందిన బండి డేవిడ్ ప్రభాకర్ (51) ఓ గిటారిస్టు. సంగీతంపై మక్కువతో గిటార్ ను, ఇతర వాద్యపరికరాలను వాయించడం నేర్చుకున్నాడు. అంతేకాదు, తాను నేర్చుకున్న విద్యను ఇతరులకు కూడా నేర్పుతూ సంగీత సేవ చేస్తున్నాడు. తాజాగా ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఏకబిగిన 28 గంటల పాటు గిటార్ పాఠాలు బోధించి ప్రపంచ ప్రఖ్యాత గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించాడు.
డేవిడ్ ప్రభాకర్ 1996 నుంచి గిటార్, ఇతర వాద్య పరికరాలపై బోధన నిర్వహిస్తున్నారు. ఆయనకు గతంలో వరల్డ్ ఫాస్టెస్ట్ గిటారిస్ట్ రికార్డు కూడా దక్కింది. ఏడు సెషన్ల పాటు కూర్చోకుండా, కనీసం గోడను ఆసరా చేసుకోకుండా ఈ ఘనత సాధించారు. ఆర్నెల్ల పాటు సాధన చేసి ఈ రికార్డు సాధించారు.
చాలామంది సంగీతం నేర్చుకుని వదిలేస్తుంటారని, అయితే తాను సంగీత సాధన ద్వారా క్రమశిక్షణ, భావవ్యక్తీకరణ, జ్ఞాపకశక్తి, ఇతర ప్రయోజనాలు అలవడతాయన్నది చూపించాలనుకున్నట్టు డేవిడ్ ప్రభాకర్ వెల్లడించారు.