Rajinikanth: ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన రజనీకాంత్... వీడియో ఇదిగో!

Rajinikanth discharged from Hyderabad Apollo hospital

  • ఇటీవల షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన రజనీ
  • అస్వస్థతకు గురైన వైనం
  • జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చేరిక
  • ఈ మధ్యాహ్నం తర్వాత డిశ్చార్జి చేసిన వైద్యులు
  • హైదరాబాద్ నుంచి చెన్నై పయనం

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హైదరాబాద్ అపోలో ఆసుపత్రి నుంచి కొద్దిసేపటి క్రితం డిశ్చార్జి అయ్యారు. ఇటీవల బీపీలో హెచ్చుతగ్గుల కారణంగా ఆయన ఆసుపత్రిపాలయ్యారు. 'అన్నాత్తే' చిత్రం షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన రజనీకాంత్ అస్వస్థతకు గురవడంతో జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించారు. రజనీకి చికిత్స చేసిన వైద్యులు ఆయన కోలుకోవడంతో ఈ మధ్యాహ్నం తర్వాత డిశ్చార్జి చేశారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ నుంచి చెన్నై పయనం అయ్యారు.

అటు, అపోలో డాక్టర్లు తలైవా ఆరోగ్య పరిస్థితిపై బులెటిన్ విడుదల చేశారు. రజనీకాంత్ రక్తపోటు సాధారణ స్థితికి వచ్చిందని వెల్లడించారు. వారం రోజుల పాటు పూర్తిస్థాయిలో విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఒత్తిడికి గురికాకుండా కొద్దిపాటి వ్యాయామం చేయాలని తెలిపారు. వయసు రీత్యా రజనీకాంత్ ఆరోగ్య నియమాలు పాటించాలని స్పష్టం చేశారు. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని రజనీకి అపోలో వైద్యులు సూచించారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News