Mahesh Babu: "ఇంకెవరైనా ఉంటే అక్కడే ఉంటారు"... థమ్సప్ కొత్త యాడ్ లో మహేశ్ బాబు పవర్ ఫుల్ డైలాగ్

Mahesh Babu acts in Thumsup latest ad
  • థమ్సప్ కొత్త యాడ్ లో నటించిన మహేశ్ బాబు
  • యాడ్ లో యాక్ట్ చేసిన బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్
  • తాజాగా యాడ్ వీడియో రిలీజ్ చేసిన థమ్సప్
  • హాలీవుడ్ తరహాలో జాంబీ కాన్సెప్ట్ తో సరికొత్త యాడ్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాలే కాకుండా వాణిజ్య ప్రకటనల రంగంలోనూ బిజీ స్టార్. ఆయన చరిష్మాను బడా కంపెనీలు తమ ఉత్పత్తుల ప్రచారానికి వినియోగించుకోవడం తెలిసిందే. ఇటీవల ముంబయి వెళ్లిన మహేశ్ బాబు థమ్సప్ శీతలపానీయం యాడ్ ఫిలిం షూటింగ్ లో పొల్గొన్నాడు. ఈ యాడ్ లో మహేశ్ బాబుతో పాటు బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ కూడా కనిపించడం మరో విశేషం. ఈ యాడ్ ను థమ్సప్ తాజాగా తన ట్విట్టర్ అకౌంట్ లో విడుదల చేసింది.

దీంట్లో మహేశ్ బాబు సినిమాను తలపించేలా పవర్ ఫుల్ డైలాగ్స్ తో ఆకట్టుకున్నాడు. "ఈ ప్రపంచంలో చివరిగా మగాళ్లం మనమిద్దరమే ఉన్నామనుకుంటా" అని రణవీర్ చెప్పగా.... "ఇంకెవరైనా ఉంటే అక్కడే ఉంటారు" అంటూ మహేశ్ బాబు తనదైన శైలిలో పంచీగా డైలాగ్ చెప్పడం ఈ యాడ్ ను రక్తికట్టిస్తోంది. అంతేకాదు, ఈ యాడ్ ను ఓ హాలీవుడ్ చిత్రం స్టయిల్లో జాంబీ కాన్సెప్ట్ తో తీశారు. ఏదేమైనా రఫ్ లుక్ తో మహేశ్, రణవీర్ పోటాపోటీగా కనిపించారు.
Mahesh Babu
Thumsup
Ranveer Singh
Ad
Video

More Telugu News