Allu Arjun: ‘మా నాన్నను ఓ ప్రశ్న అడుగు’.. సమంతకు ఫోన్ లో చెప్పిన అల్లు అర్జున్ కుమారుడు.. వీడియో ఇదిగో

ask a question to my dad says bunny son
  • ‘ఆహా’ నిర్వహిస్తోన్న సామ్‌జామ్ షో 
  • ఏడో ఎపిసోడ్‌లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్
  • సమంత అడిగిన ప్రశ్నలకు సమాధానం
  • ప్రోమో విడుదల చేసిన ఆహా  
‘ఆహా’ నిర్వహిస్తోన్న సామ్‌జామ్ షో ఏడో ఎపిసోడ్‌లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పాల్గొన్నాడు. సమంత అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పాడు. ఇందుకు సంబంధించిన ప్రోమోను ఆహా విడుదల చేసింది.

జ‌న‌వ‌రి 1న  ఈ ఎపిసోడ్ ఆహాలో ప్రసారం కానుంది. ఈ షోలో అల్లు అర్జున్ కుమారుడు అయాన్ సమంతతో ఫోన్ లో మాట్లాడాడు. త‌న తండ్రిని ఓ ప్ర‌శ్న అడ‌గాలని స‌మంతకు చెప్పాడు. ఏ ప్రశ్న అడగాలని చెప్పాడన్న విషయాన్ని ప్రోమోలో చూపలేదు.

కాగా, అల్లు అర్జున్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే తాను ‘హార్డ్‌వర్క్’ అని చెబుతానని సమంత చెప్పింది. అల్లు అర్జున్‌కి ఇష్టమైన హీరోయిన్ ఎవరన్న విషయాన్ని సామ్‌జామ్ టీం తెలుసుకోవాలనుకుంటోందని తెలిపింది. బన్నీ, సామ్ మధ్య చాలా సరదాగా సంభాషణ కొనసాగింది.

    
Allu Arjun
Tollywood
sam jam
Samantha

More Telugu News