Varla Ramaiah: జడ్జిలను కించపరిచిన పూతలపట్టు ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలి: వర్ల రామయ్య డిమాండ్

Varla Ramaiiah demands action on Puthalapattu MLA
  • జడ్జిలపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే బాబు
  • ఎవరు డబ్బిస్తే వారికి అనుకూలంగా తీర్పులిస్తారని విమర్శలు
  • స్పందించిన వర్ల రామయ్య
  • సుమోటోగా కేసు నమోదు చేయాలంటూ ట్వీట్
  • లేకపోతే న్యాయవ్యవస్థ గౌరవానికే భంగం అని వెల్లడి
ఇటీవల కాలంలో వైసీపీ నేతలు న్యాయవ్యవస్థలపై అసహనం వ్యక్తం చేస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా, చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. జడ్జిలు ఎవరు డబ్బులిస్తే వారికి అనుకూలంగా తీర్పులు ఇస్తున్నారని, వీళ్లసలు న్యాయమూర్తులేనా? అంటూ తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై టీడీపీ అగ్రనేత వర్ల రామయ్య స్పందించారు.

"మీరు జడ్జిలేనా? ఎవరు డబ్బులిస్తే వారికి అనుకూలంగా తీర్పులిస్తారా? మరీ ఇంత అవినీతి పనికిరాదు, ఆయన చెప్పింది చేయడానికే మీరు న్యాయమూర్తులుగా ఉన్నారా?" అంటూ సాక్షాత్తు ఓ ఎమ్మెల్యే (పూతలపట్టు) న్యాయస్థానాలను కించపరిచారని వర్ల రామయ్య ఆరోపించారు. ఆ ఎమ్మెల్యేపై సుమోటోగా కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే, న్యాయవ్యవస్థ గౌరవానికే భంగం అని పేర్కొన్నారు.
Varla Ramaiah
MS Babu
MLA
Putrhalapattu
Judges
YSRCP
Telugudesam

More Telugu News