Britain: కరోనా కొత్త స్ట్రెయిన్: బ్రిటన్‌లో అమల్లోకి కఠిన ఆంక్షలు!

Lockdown begins once again in Britain

  • బ్రిటన్‌లో శరవేగంగా విస్తరిస్తున్న కొత్త వైరస్
  • తూర్పు, వాయవ్య ఇంగ్లండ్‌లో 60 లక్షల మందిపై ఆంక్షల ప్రభావం
  • స్కాట్లాండ్, ఐర్లండ్‌లలోనూ ఆంక్షలు

కరోనా కొత్త స్ట్రెయిన్ నేపథ్యంలో బ్రిటన్‌లో నిన్నటి నుంచి కఠిన ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. కొత్త కేసులు శరవేగంగా విస్తరిస్తుండడం, క్రిస్మస్ అనంతరం వైరస్ మరింత వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో ఈ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి.  తూర్పు, వాయవ్య ఇంగ్లండ్‌లోని 60 లక్షల మంది ప్రజలపై ప్రభుత్వం కొవిడ్ ఆంక్షలను విధించింది.

కరోనా కొత్త వైరస్ నేపథ్యంలో స్కాట్లాండ్, నార్తర్న్ ఐర్లండ్‌లలోనూ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. బార్లు, రెస్టారెంట్లు మూసివేశారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. నిజానికి క్రిస్మస్‌కు ముందే బ్రిటన్‌లో ఆంక్షలు అమల్లోకి వచ్చాయి.  అయితే, కొత్త వైరస్ మరింత వేగంగా విస్తరిస్తుండడంతో ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది.

ఉత్తర ఐర్లండ్‌లో నిన్నటి నుంచి ఆరు వారాలపాటు లాక్‌డౌన్ ప్రకటించారు. బార్లు, రెస్టారెంట్లతోపాటు జిమ్‌లు, బ్యూటీపార్లపై నిషేధం విధించారు. స్కాంట్లాండ్‌లోనూ మూడు వాారాలపాటు ఆంక్షలు విధించారు. కేవలం నిత్యావసర సరుకులకు తప్ప బయటకు రావొద్దని హెచ్చరికలు  జారీ చేశారు.

Britain
Corona Virus
New strain
Lockdown
  • Loading...

More Telugu News