Andhra Pradesh: ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసుల సంఖ్య

Corona cases drastically decreased in AP

  • 24 గంటల్లో కేవలం 282 కేసుల నమోదు
  • ఇదే సమయంలో ఒకరి మృతి
  • రాష్ట్రంలో ప్రస్తుతం 3,700 యాక్టివ్ కేసులు

గత 24 గంటల్లో ఏపీలో కరోనా కొత్త కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. కేవలం 282 కొత్త కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఇదే సమయంలో కేవలం ఒక వ్యక్తి మాత్రమే కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల్లో 442 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని ఆరోగ్యవంతులు అయ్యారు. తాజా గణాంకాలతో కలిపి ఇప్పటి వరకు 8,80,712 మంది కరోనా బారిన పడ్డారు. 7,092 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,700 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇప్పటి వరకు 8,69,920 మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో  42,911 మందికి కోవిడ్ టెస్టులు చేశారు. పూర్తి వివరాల కోసం కింది టేబుల్ చూడండి.


Andhra Pradesh
Corona Virus
Updates
  • Loading...

More Telugu News