Varla Ramaiah: అమరావతి ఏక కుల ప్రాంతమనడం సీఎం మానసిక అనారోగ్యానికి నిదర్శనం: వర్ల రామయ్య

Varla Ramaiah fires on CM Jagan

  • సీఎం జగన్ పై వర్ల వ్యాఖ్యలు
  • అమరావతి ప్రజలను కించపరిచేలా మాట్లాడారని ఆరోపణ
  • అమరావతి తెలుగు వైభవ శోభిత ప్రాంతమని వివరణ
  • అన్ని కులాలు, మతాలతో విరాజిల్లిందని స్పష్టీకరణ

ఏపీ సీఎం జగన్ పై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. సీఎం జగన్ అమరావతి ప్రజలను కించపరిచేలా మాట్లాడడం తప్పు అని విమర్శించారు. అమరావతి తెలుగు వైభవ శోభిత ప్రాంతమని, శాతవాహనుల రాజధానిగా వెలుగొందిన ప్రాంతమని వర్ల రామయ్య వివరించారు. అన్ని కులాలు, మతాలతో విరాజిల్లిన సర్వశోభితం ఇది... బౌద్ధమతం పరిఢవిల్లిన పవిత్రస్థలమిది అంటూ ట్వీట్ చేశారు. అలాంటి ప్రాంతాన్ని ఏక కుల ప్రాంతం అనడం సీఎం మానసిక అనారోగ్యానికి నిదర్శనం అని పేర్కొన్నారు.

Varla Ramaiah
Jagan
Amaravati
Buddism
Andhra Pradesh
  • Loading...

More Telugu News