Manchu Manoj: భారీగా బరువు తగ్గి స్మార్ట్ గా తయారైన మంచు మనోజ్

Manchu Manoj gets new look

  • 15 కిలోల బరువు తగ్గిన మనోజ్
  • కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న మనోజ్
  • ప్రస్తుతం 'అహం బ్రహ్మస్మి' సినిమాలో నటిస్తున్న మంచువారబ్బాయి

హీరో మంచు మనోజ్ న్యూ లుక్ లోకి మారాడు. వర్కౌట్స్ చేసి ఏకంగా 15 కిలోల బరువు తగ్గాడు. ఆయుర్వేదిక్ డైట్, కఠినమైన ఎక్సర్ సైజులు చేసి స్లిమ్ గా తయారయ్యాడు. తన న్యూ లుక్ ఫొటోలను సోషల్ మీడియా ద్వారా మనోజ్ షేర్ చేశాడు. అభిమానులకు వైకుంఠ ఏకాదశి, క్రిస్మస్ శుభాకాంక్షలను తెలియజేశాడు. అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించాడు.

కాగా, కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల మంచు మనోజ్ కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఇప్పుడిప్పుడే వరుసగా సినిమాలను పట్టాలెక్కిస్తున్నాడు. 'అహం బ్రహ్మస్మి' చిత్రంలో నటిస్తున్నాడు. మరో రెండు సినిమాలకు కూడా ఓకే చెప్పినట్టు సమాచారం. వచ్చే ఏడాది ఈ మూడు సినిమాలు రిలీజ్ కానున్నాయి.

Manchu Manoj
Tollywood
New Look
  • Error fetching data: Network response was not ok

More Telugu News