Jagtial District: జగిత్యాలలో బండి సంజయ్‌ పర్యటన నేపథ్యంలో టీఆర్ఎస్ కార్యకర్తల ఆందోళన

ruckus in jagtial

  • కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నుంచి నిధులు తేవాలని డిమాండ్
  • తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు నిధులు రావాల్సి ఉందని వ్యాఖ్య
  • రూ.1,024 కోట్లను విడుదల చేయించాలని డిమాండ్
  • మోహరించిన పోలీసులు

జగిత్యాల జిల్లాలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ పర్యటన నేపథ్యంలో టీఆర్ఎస్ కార్యకర్తలు నిరసనలు తెలుపుతున్నారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నుంచి తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు రావాల్సిన రూ.1,024 కోట్లను విడుదల చేయించాలని డిమాండ్ చేస్తూ వారు ప్లకార్డులు ప్రదర్శించారు.

దీంతో జగిత్యాల, థరూర్ బ్రిడ్జిపై గందరగోళం నెలకొంది. జగిత్యాల నియోజకవర్గ పరిధిలోని సర్పంచ్‌లతో పాటు టీఆర్‌ఎస్‌ నేతల ఆధ్వర్యంలో ఈ నిరసన ప్రదర్శన కొనసాగుతోంది. బండి సంజయ్‌ పర్యటనకు అడ్డుతగులుతోన్న నేపథ్యంలో టీఆర్ఎస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకోవాలని బీజేపీ నేతలు పోలీసులను కోరుతున్నారు. బండి సంజయ్ పర్యటన, టీఆర్ఎస్ కార్యకర్తల నిరసనల నేపథ్యంలో అక్కడ పోలీసులు మోహరించారు.

Jagtial District
Bandi Sanjay
BJP
  • Loading...

More Telugu News