BCCI: 2022 సీజన్ నుంచి 10 జట్లతో ఐపీఎల్... బీసీసీఐ కీలక నిర్ణయం

BCCI decides to include another two teams in IPL

  • ప్రస్తుతం 8 జట్లతో ఐపీఎల్
  • కొత్తగా రెండు ఫ్రాంచైజీలకు అవకాశం
  • బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో చర్చ
  • ఆమోదం తెలిపిన సభ్యులు
  • 2028 ఒలింపిక్స్ లో క్రికెట్ ను చేర్చడంపై మద్దతు

ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పోటీలను 8 జట్లతో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, 2022 సీజన్ నుంచి ఐపీఎల్ లో 10 జట్లు క్రికెట్ వినోదాన్ని అందించనున్నాయి. ఈ మేరకు రెండు కొత్త జట్ల ప్రవేశానికి బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ జరిగిన బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో దీనిపై చర్చించారు. 2021 సీజన్ నుంచే 10 జట్లతో ఐపీఎల్ జరపాలని కొందరు సభ్యులు ప్రతిపాదించినా, ఇప్పుడంత సమయం లేదని, రెండు కొత్త జట్లకు బిడ్డింగ్ లు పిలవాల్సి ఉండడంతో నూతన ఫ్రాంచైజీలను హడావిడిగా నిర్ణయించలేమని బోర్డు యాజమాన్యం పేర్కొంది.

ఇక, 2028 ఒలింపిక్స్ లో క్రికెట్ ను కూడా చేర్చాలన్న ఐసీసీ నిర్ణయానికి సూత్రప్రాయంగా మద్దతు పలకాలని నేటి సమావేశంలో నిర్ణయించారు. ముందుగా, ఒలింపిక్స్ లో క్రికెట్ ప్రవేశం విధివిధానాలపై ఐసీసీ నుంచి తగిన స్పష్టత కోరాలని భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News