Somireddy Chandra Mohan Reddy: భూముల రికార్డులను మార్చేసి వైసీపీ నేతలు రూ.కోట్ల దోపిడీ చేస్తున్నారు: సోమిరెడ్డి

somireddy slams ysrcp

  • పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీలో అవినీతి
  • దేవాలయాల భూములు ఎవరి సొంతమూ కాదు
  • దాతలిచ్చిన భూములకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలి
  • చట్ట ప్రకారం సేకరించకుండానే వాటిని ఎలా పంపిణీ చేస్తారు

వైసీపీ సర్కారుపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పలు ఆరోపణలు చేశారు. ఏపీలో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీలో అవినీతి జరుగుతోందని అన్నారు. ఇళ్ల స్థలాల పేరుతో వైసీపీ నేతలు పాల్పడుతోన్న దోపిడీనే తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. దేవాలయాల భూములు ఎవరి సొంతమూ కాదని, దాతలిచ్చిన భూములకు ప్రభుత్వం పరిహారం చెల్లించి, చట్ట ప్రకారం సేకరించకుండానే వాటిని ఎలా పంపిణీ చేస్తారని ఆయన నిలదీశారు.

భూముల రికార్డులను మార్చేసి వైసీపీ నేతలు కోట్లాది రూపాయల దోపిడీకి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. దేవాలయాల భూములను పరిరక్షించాల్సిందిపోయి ప్రభుత్వ నేతలే భూములను ఆక్రమించుకుంటున్నారని ఆయన విమర్శించారు. అక్రమాలు చేస్తున్న  వైసీపీ నేతలతో పాటు రెవెన్యూ అధికారులపై కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 

Somireddy Chandra Mohan Reddy
Telugudesam
YSRCP
  • Loading...

More Telugu News