Mamata Banerjee: వేదికపై హుషారుగా మ‌మ‌తా బెన‌ర్జీ డ్యాన్స్.. వీడియో వైరల్

cm mamata dances

  • జాన‌ప‌ద క‌ళాకారుల‌తో క‌లిసి డ్యాన్స్
  • మ్యూజిక్ ఫెస్టివ‌ల్‌ను ప్రారంభించిన మమత
  • సంత‌ల్ డ్యాన్సర్ బ‌సంతీ హేమ్‌బ్ర‌మ్‌తో కలిసి స్టెప్పులు

జాన‌ప‌ద క‌ళాకారుల‌తో క‌లిసి ప‌శ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ డ్యాన్స్ చేశారు. తాజాగా, మ్యూజిక్ ఫెస్టివ‌ల్‌ను ఆమె ప్రారంభించిన సందర్భంగా అందులో హుషారుగా పాల్గొని అందరినీ ఆశ్చర్యపర్చారు. కొన్ని నెలల్లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మ‌మ‌తా బెన‌ర్జీ పలు కార్యక్రమాల్లో వరుసగా పాల్గొంటున్నారు.

ఈ నేపథ్యంలో మ్యుజీషియ‌న్లు, గాయకులు, నృత్యకారులు నిర్వహించిన మ్యూజిక్  ఫెస్ట్‌లో ఆమె పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్ కు చెందిన సంత‌ల్ డ్యాన్సర్ బ‌సంతీ హేమ్‌బ్ర‌మ్‌ను ఈ సందర్భంగా మ‌మ‌త స‌న్మానించారు. త‌న‌కు ఆ నృత్యం నేర్పించాలని బసంతీని మమతా బెనర్జీ అడిగారు. అనంతరం డ్యాన్స్ చేసి అలరించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటోన్న మమతా బెనర్జీ.. బీజేపై మరోసారి తీవ్రస్థాయి ధ్వజమెత్తారు.

 

Mamata Banerjee
West Bengal
dance
Viral Videos
  • Error fetching data: Network response was not ok

More Telugu News