RGV: మారుతీరావు కూతురు అమృత చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి: రామ్ గోపాల్ వర్మ

murder movie  releases today says rgv

  • మర్డర్ సినిమా ఈ రోజు విడుదల
  • ఈ సినిమా విడుదలను ఆపడానికి అమృత యత్నం
  • థియేటర్లలో నిజాన్ని చూడండి

శ్రీకాంత్ అయ్యంగార్, గాయత్రీ భార్గవి, సాహితి, గిరిధర్ ప్రధాన పాత్రల్లో రామ్ గోపాల్ వర్మ రూపొందించిన మర్డర్ సినిమా ఈ రోజు విడుదలవుతోంది. ఈ సినిమా విడుదలను నిలిపివేయాలని కోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో దీని విడుదల వాయిదా పడుతూ వచ్చింది. చివరకు కోర్టు అనుమతి ఇవ్వడంతో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.

దీనిపై రామ్ గోపాల్ వర్మ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా విడుదలను ఆపడానికి మారుతీరావు కూతురు అమృత చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఈ రోజు ఈ సినిమా విడుదలవుతోంది. థియేటర్లలో నిజాన్ని చూడండి’ అని వర్మ పేర్కొన్నారు. ఇటీవల ఈ సినిమా విడుదల గురించి అమృత కోర్టుకు వెళ్లడం వంటి అంశాలను ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ప్రస్తావించారు.  

కాగా,  ప్రణయ్ భార్య అమృత నిన్న మరోసారి హైకోర్టును ఆశ్రయించింది. తన కథనే సినిమాగా తీశారని ఆమె తన పిటిషన్ లో ఆరోపించింది. అయితే, ఆమె వేసిన లంచ్ మోషన్ పిటిషన్ విచారణకు హైకోర్టు నిరాకరించింది. దీంతో ఈ రోజు సినిమా విడుదల అవుతోంది.

RGV
amrita
Tollywood
  • Error fetching data: Network response was not ok

More Telugu News