Rajinikanth: రజనీకాంత్ సినిమా షూటింగ్ లో కరోనా కలకలం... తలైవాకు నెగెటివ్

Corona crisis in Rajinikanth movie sets
  • అన్నాత్తే చిత్రంలో నటిస్తున్న రజనీకాంత్
  • హైదరాబాదులో తాజా షెడ్యూల్
  • నలుగురికి కరోనా పాజిటివ్
  • వారిలో ఒకరు రజనీ సన్నిహితులు!
  • స్వీయ నిర్బంధంలోకి రజనీకాంత్
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న 'అన్నాత్తే' చిత్రం షూటింగ్ నిలిచిపోయింది. ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుండగా, చిత్ర యూనిట్ లో నలుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది. సెట్స్ పై కరోనా కలకలం రేగడంతో చిత్రీకరణ అర్థాంతరంగా ఆపేశారు.

అటు, తలైవా రజనీకాంత్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ రావడంతో చిత్ర యూనిట్ ఊపిరి పీల్చుకుంది. అయితే, సెట్స్ పై కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో ఒకరు రజనీకాంత్ కు సన్నిహితులని గుర్తించారు. దాంతో రజనీ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు.

యూనిట్ సభ్యులకు కరోనా సోకిందన్న విషయాన్ని ఈ చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ వెల్లడించింది. సాధారణ చెకప్ లో భాగంగా కరోనా టెస్టులు నిర్వహిస్తే నలుగురికి పాజిటివ్ వచ్చిందని సన్ పిక్చర్స్ ట్వీట్ చేసింది.
Rajinikanth
Shooting
Corona Virus
Positive
Annatthe
Hyderabad

More Telugu News