Chandrababu: తిరుమలకు వెళుతున్న భక్తులపై లాఠీ ఛార్జ్ చేయడం దారుణం: చంద్రబాబు

Chandrababu condemns lathicharge on devotees of Lord Balaji

  • సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులను అనుమతించడం లేదు
  • స్వామిని దర్శించుకునే హక్కు ప్రతి భక్తుడికి ఉంటుంది
  • కొండపైన డ్రోన్లు ఎగురవేస్తుంటే ఏం చేస్తున్నారు?

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తిరుపతి తిరుమల దేవస్థానం ప్రతిష్టను మంటకలిపేలా ప్రయత్నిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. స్వామి వారి దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన సామాన్య భక్తులను కొండపైకి అనుమతించకపోగా, వారిపై లాఠీ ఛార్జ్ చేయడం అంత్యంత హేయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులకు ప్రశాంత వాతావరణంలో దర్శన ఏర్పాట్లను చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని అన్నారు.

నిబంధనలకు విరుద్ధంగా 2 వేల మంది వైసీపీ శ్రేణులు తిరుమల కొండ మీద రాజకీయ ఊరేగింపులు చేస్తూ, డ్రోన్లు ఎగురవేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. స్వామి వారిని దర్శించుకునే హక్కు ప్రతి భక్తుడికి ఉందనే విషయాన్ని ప్రభుత్వం గుర్తుంచుకోవాలని అన్నారు. ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలను పక్కన పెట్టి... శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతించాలని చెప్పారు.

  • Loading...

More Telugu News