AP High Court: స్థానిక ఎన్నికల నిర్వహణలో ఎస్ఈసీకి సహకరించండి: ఏపీ సర్కారుకు స్పష్టం చేసిన హైకోర్టు

AP High Court orders state government to assist SEC to conduct local body elections

  • ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలకు ఎస్ఈసీ నిర్ణయం
  • వ్యతిరేకిస్తున్న ఏపీ ప్రభుత్వం
  • హైకోర్టుకు చేరిన వ్యవహారం
  • ఎన్నికలు జరిపేందుకు ఎస్ఈసీకి అధికారం ఉందన్న కోర్టు
  • అధికారులు నిమ్మగడ్డ రమేశ్ ను కలవాలని ఆదేశం

స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం మొగ్గు చూపుతుండగా, ఇప్పట్లో కుదరదని ఏపీ సర్కారు తెగేసి చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం హైకోర్టుకు చేరగా, రాష్ట్ర ఎన్నికల సంఘానికి అనుకూలంగా ఆదేశాలు వెలువడ్డాయి. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్న ఎస్ఈసీకి సహరించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను ప్రభుత్వ అధికారులు కలవాలంటూ స్పష్టం చేసింది.

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఎస్ఈసీ నిర్ణయం తీసుకుంటారని హైకోర్టు పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు జరపవచ్చో, లేదో నిర్ణయించుకునే పూర్తి అధికారం ఎస్ఈసీకి ఉందని ధర్మాసనం వెల్లడించింది. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని ఏపీ సర్కారు అంగీకరించడంలేదు.

  • Loading...

More Telugu News