Buddha Venkanna: 'కుప్పం కూడా గోవిందా గోవిందా' అంటూ విజయసాయి వ్యాఖ్యలు... 'ఓట్లతో సంబంధంలేని రాజ్యసభ ఎంపీవి' అంటూ బుద్ధా కౌంటర్

Buddha Venkanna counters Vijayasai comments

  • కొడుకును ఓడగొట్టుకున్నాడంటూ బాబుపై విజయసాయి వ్యంగ్యం
  • కుప్పం చాలెంజ్ మీకు అవసరమా అంటూ బుద్ధా స్పందన
  • కరోనా పేరు చెప్పి పారిపోయారని ఎద్దేవా 
  • కరకట్ట కమల్ హాసన్ తో రాజీనామా చేయించాలని సవాల్

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న దీటుగా బదులిచ్చారు. ఎన్నికలకు వెళదాం రండి అని చంద్రబాబు సవాలు చేశాడని, మంగళగిరిలో కొడుకును ఓడగొట్టుకున్న చంద్రబాబుకు ఈసారి కుప్పం కూడా గోవిందా గోవిందా అంటూ విజయసాయి వ్యంగ్యం ప్రదర్శించారు. దీనిపై బుద్ధా స్పందించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ఎస్ఈసీ ప్రయత్నిస్తుంటే, కరోనా పేరు చెప్పి పారిపోయిన మీకు కుప్పం చాలెంజ్ అవసరమా? అని చురకలంటించారు.

"అయినా, నీకేం పోయింది... ఓట్లతో సంబంధంలేని రాజ్యసభ ఎంపీవి. రాజీనామా అంటూ సవాల్ విసిరి 151 మందిని ఇరికించేస్తున్నావు. మీకు ఎన్నికలు జరిపే దమ్ము ఉంటే టీడీపీ దగ్గర కొన్న ఎమ్మెల్యేలతో ఎప్పుడో రాజీనామాలు చేయించేవారు. రాష్ట్రమంతటా ఎందుకు విజయసాయిరెడ్డీ... మూడు రాజధానులకు మద్దతిచ్చే మంగళగిరి ఎమ్మెల్యే కరకట్ట కమల్ హాసన్ తో రాజీనామా చేయించు" అంటూ బుద్ధా ప్రతి సవాల్ విసిరారు.

Buddha Venkanna
Vijayasai Reddy
Chandrababu
Kuppam
Nara Lokesh
Mangalagiri
  • Loading...

More Telugu News