Police: పబ్‌లో నన్ను అరెస్టు చేయలేదు.. వార్తలన్నీ అవాస్తవం: హీరో హృతిక్ మాజీ భార్య

police did not arrest me says sussanna

  • కొవిడ్-19 నిబంధనలకు విరుద్ధంగా ముంబైలో డ్రాగన్ ఫ్లై పబ్‌ను తెరిచిన నిర్వాహకులు
  • సుజానేను అరెస్టు చేశారని వార్తలు
  • పబ్‌లోకి వచ్చి అధికారులు చెక్ చేశారని వ్యాఖ్య
  • తమను అక్కడే మూడు గంటలు ఉంచి పంపారని వివరణ

కొవిడ్-19 నిబంధనలకు విరుద్ధంగా ముంబైలో డ్రాగన్ ఫ్లై పబ్‌ను తెరవడంతో పోలీసులు దానిపై దాడులు చేసి, అక్కడ ఉన్న మాజీ క్రికెటర్ సురేశ్ రైనాతో పాటు 35 మందిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అరెస్టయిన వారిలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ మాజీ భార్య సుజానే ఖాన్ కూడా ఉన్నట్టు ప్రచారం జరిగింది.

దీనిపై ఆమె స్పందిస్తూ ఆ వార్తలను ఖండించింది. తాను సోమవారం రాత్రి ఓ ఫ్రెండ్‌ బర్త్‌డే పార్టీ డిన్నర్‌కు హాజరయ్యానని తెలిపింది. ముంబైలోని ఓ పబ్‌కు తాము వెళ్లామని చెప్పింది. తెల్లవారుజామున 2 గంటలు దాటాక  కొందరు అధికారులు పబ్‌‌లోకి వచ్చి, అక్కడ కరోనా నియమ నిబంధనలను పాటిస్తున్నారా? అన్న విషయాన్ని పరిశీలించారని చెప్పింది.

ఆ సమయంలో అందులో ఉన్న వారందరినీ మూడు గంటలపాటు అక్కడే వేచి ఉండాలని చెప్పారని తెలిపింది. అనంతరం ఉదయం 6 గంటలకు తమను పంపించారని చెప్పింది. అంతేగానీ, తనను అరెస్ట్‌ చేయలేదనీ, తన అరెస్ట్‌ గురించి వస్తోన్న వార్తలు అవాస్తవమని చెప్పుకొచ్చింది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News