Abhijeet: గ్రీన్ ఇండియా చాలెంజ్ స్వీకరించిన బిగ్ బాస్ విజేత అభిజిత్

Bigg Boss winner Abhijeet accepts Green India Challenge

  • బిగ్ బాస్-4లో టైటిల్ నెగ్గిన అభిజిత్
  • గ్రీన్ ఇండియా చాలెంజ్ లో మూడు మొక్కలు నాటిన వైనం
  • సొహైల్, హారిక, కల్యాణిల నామినేషన్ 
  • కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి
  • హర్షం వ్యక్తం చేసిన ఎంపీ సంతోష్ కుమార్

ఇటీవలే ముగిసిన బిగ్ బాస్ నాలుగో సీజన్ లో సినీ నటుడు అభిజిత్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ ద్వారా మరింత ప్రజాదరణ సంపాదించుకున్న ఈ యువ హీరో తాజాగా గ్రీన్ ఇండియా చాలెంజ్ ను స్వీకరించాడు. ఈ క్రమంలో హైదరాబాదులో తనవంతుగా మూడు మొక్కలు నాటాడు. అనంతరం తనతో సహచర బిగ్ బాస్ కంటెస్టెంట్లు సొహైల్, హారిక, కరాటే కల్యాణిలను గ్రీన్ ఇండియా చాలెంజ్ కు నామినేట్ చేశాడు. కాగా, ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో అభిజిత్ తో పాటు ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి కూడా పాల్గొన్నారు. తాను ప్రారంభించిన మహా పర్యావరణ క్రతువు గ్రీన్ ఇండియా చాలెంజ్ లో అభిజిత్ పాల్గొనడం పట్ల టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News