Police: అబ్బాయిలా వేషం వేసి చోరీలకు పాల్పడుతోన్న బాలిక.. అరెస్టు

police arrest minor girl

  • ఓ వ్యక్తి నుంచి రూ.50 వేలు చోరీ 
  • నారాయణ పేటలో ఘటన
  • గతంలోనూ చోరీ కేసుల్లో దొరికిన బాలిక

అబ్బాయిలా వేషం వేసుకున్న ఓ బాలిక చోరీలకు పాల్పడుతోంది. తాజాగా, ఓ వ్యక్తి నుంచి రూ.50 వేలు చోరీ చేసి పట్టుబడడంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నారాయణ పేటలో ఈ ఘటన చోటు చేసుకుంది. కర్ణాటకలోని గుర్మిట్కల్‌ శివారులోని తొట్లూరుకు చెందిన వాసురామ్ అనే వ్యక్తి నారాయణ పేటలో షాపింగ్ చేస్తున్నాడు.

ఆ సమయంలో అతని కుటుంబ సభ్యులు కూడా ఆయన వెంటనే ఉన్నారు. ఆ సమయంలో అబ్బాయి వేషధారణలో ఉన్న ఓ బాలిక ఆయన జేబులో నుంచి రూ.50 వేలు కొట్టేసింది. దీంతో అక్కడున్న పోలీసులకు వాసురామ్ ఈ విషయం చెప్పాడు.  

అక్కడ విచారణ జరిపి, అబ్బాయిల వేషధారణలో ఉన్న బాలికను గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఆ బాలిక కూడా షాపింగ్ చేసి స్మార్ట్ ఫోన్, దుస్తులను కొనుగోలు చేసిందని చెప్పారు. ఆ బాలిక గతంలోనూ పలు చోరీ కేసుల్లో అరెస్టయిందని చెప్పారు.

  • Loading...

More Telugu News