Cold Wave: హైదరాబాద్ కు ఐఎండీ 'కోల్డ్ వేవ్' వార్నింగ్!

Cold Warning for Telangana

  • మరింతగా పెరగనున్న చలి
  • ఉత్తరాది నుంచి శీతల పవనాలు
  • హెచ్చరించిన వాతావరణ శాఖ

ఉత్తర భారతావని నుంచి వీస్తున్న శీతల పవనాల కారణంగా తెలంగాణలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయితో పోలిస్తే మరింతగా పడిపోయిన నేపథ్యంలో భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కు 'కోల్డ్ వేవ్' వార్నింగ్ జారీ చేసింది. శీతల పవనాల కారణంగా అత్యంత చలి వాతావరణం ఏర్పడనుందని, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తుందని హెచ్చరించింది. కాగా, ఈ ఉదయం హైదరాబాద్ నగరాన్ని పొగమంచు కమ్మేసింది. ఈ సీజన్ లో తొలిసారిగా రాత్రిపూట ఉష్ణోగ్రత 11 డిగ్రీలకు పడిపోయింది.

మరో రెండు రోజులు ఇదే పరిస్థితి నెలకొని ఉంటుందని తెలిపిన వాతావరణ శాఖ, 25 తరువాత చలి వాతావరణం తగ్గవచ్చని అంచనా వేసింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో 5.7 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రత పడిపోయిందని పేర్కొన్న అధికారులు, ఈ సీజన్ లో ఇదే అత్యల్పమని అన్నారు. ఈ సీజన్ లో ఇదే అతి తక్కువని, కొన్ని ప్రాంతాల్లో మైనస్ 2.1 నుంచి మైనస్ 4 వరకూ కూడా ఉష్ణోగ్రతలు తగ్గవచ్చని తెలిపారు.

కాగా, గడచిన 24 గంటల్లో తెలంగాణలోని హనుమకొండలో 11, హైదరాబాద్ లో 11.1, మెదక్ లో 13, హకీంపేటలో 14.6, ఖమ్మంలో 14.8, భద్రాచలంలో 15, మహబూబ్ నగర్ లో 15.7, నల్గొండలో 15.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Cold Wave
IMD
Telangana
  • Loading...

More Telugu News